ENGLISH | TELUGU  
Home  » TV News

Brahmamudi:  బ్రహ్మముడి సీరియల్ లోకి కొత్త విలన్ ఎంట్రీ.. అతను ఎవరంటే!

on Sep 21, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-520 లో..  అప్పు, కళ్యాణ్ లు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తుంటారు. వారికి అడ్డంగా కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి అనామిక బయటకు దిగి వారి దగ్గరికి వస్తుంది. దుగ్గిరాల వారసుడు రోడ్డున పడ్డట్లున్నాడు? కనీసం కారు కూడా లేనట్లుందని అనామిక అంటుంది. నీలాగా మాకు పరాయి వాళ్ల కారుల్లో తిరిగే అలవాటు లేదులే అనామికా అని అప్పు అంటుంది. వెంటనే అనామిక.. పరాయి వాళ్లు ఎవరున్నారు ఇక్కడ అంటూ తను దిగిన కారు డ్రైవ్ చేసుకొచ్చిన ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తుంది. 

ఇతడే నాకు కాబోయే భర్త.. పేరు సామంత్. సామంత్ గ్రూప్ ఆఫ్ జ్యూవెలరీస్ కంపెనీ చైర్మెన్.. దుగ్గిరాల వారి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి నిజమైన ప్రత్యర్థి.. తొందరలోనే దుగ్గిరాల వారి కంపెనీని పడగొట్టి ఎదురులేని సంస్థగా సామంత్ కంపెనీ ఎదుగుతుందంటూ అనామిక చెప్తుంది. దాంతో అప్పూ, కవి ఫక్కున నవ్వేస్తారు. ఎందుకు అలా నవ్వుతున్నారని అనామిక అనగానే.. ఒక చీమ.. ఏనుగు కుంభస్థలంపైన నిలబడి పాతాళంలోకి తొక్కేస్తాను అందట.. అలా ఉందని కళ్యాణ్ అంటాడు. అలా అనామికని కళ్యాణ్, అప్పులు అవమానించేసరికి సామంత్ రియాక్ట్ అవుతాడు. నా గురించి నీకు తెలియదని సామంత్ కోపంగా అంటాడు. నీ గురించి కళ్యాణ్‌కి తెలియదు నిజమే.. కానీ నీ పక్కనున్న దాని గురించి తెలుసు.. నిన్ను మొత్తం ముంచేసి రోడ్డున పడేస్తుందని అప్పు అంటుంది. అందరు మీ కళ్యాణ్‌ లానే రోడ్డు మీద పడతారు అనుకున్నావా అని అనామిక అనగా.. నేను రోడ్డున పడలేదు.. ఆస్తులన్నీ వదలుకుని, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నానని కళ్యాణ్ అంటాడు. దీన్నే మరి రోడ్డుమీద పడటం అంటారని సామంత్ కోపంగా అంటాడు. అప్పూ, కళ్యాణ్ లను చూసి అనామిక నవ్వుతుంది. దీన్ని రోడ్డున పడటం అనరు.. రోడ్డున పడటం అంటే ఏంటో త్వరలోనే నీకు ఈ అనామిక తెలిసేలా చేస్తుందిలే.. ఎందుకంటే దుగ్గిరాల వారి మీద పగ తీర్చుకోవడం కోసం జ్యూయెలరీ సంస్థ అధినేతనే పట్టిందంటే అది నీ మీద ప్రేమతో కాదు. మా కంపెనీ మీదున్న పగతో.. కాబట్టి నిన్ను బకరాని చేసి వాడుకుంటుంది. ఆ తర్వాత దులుపేసుకుని పోతుంది. దీని బతుక్కి ఏం పేరు పెట్టాలో తెలియడం లేదని అప్పు అనగానే.. షటప్ అంటూ అనామిక అంటుంది.

నాతో ఉన్నప్పుడు యువరాజులా ఉండేవాడివి.. దీన్ని చేసుకుని ఒక సామాన్యుడిలా బతుకుతున్నావే.. చూశావా.. దీని దరిద్రం నీకు తగులుకుందని అనామిక అనగానే.. నాకు పట్టుకున్న దరిద్రం కోర్టులోనే వదిలిపోయింది.. నీతో కలిసి ఆ కోటలో ఉన్నప్పుడు నరకంలా ఉండేది.. ఇప్పుడు నా భార్యతో కలిసి చిన్న గదిలో ఉన్నా స్వర్గంలా అనిపిస్తోందని అప్పు వైపు ప్రేమగా చూస్తూ కళ్యాణ్ అంటాడు. హా.. అవునా.. నాలుగు రోజులు అలానే ఉంటుంది. ఆ తర్వాత మొదలవుతుంది పేదరికం.. నువ్వు ఎలాగో కవితలు రాయడానికి తప్పితే ఎందుకూ పనికిరావు.. ఇప్పుడు ఇది పిజ్జాలు, బర్గర్లు అమ్మి నిన్ను పోషిస్తూ ఉండొచ్చు.. నాలుగు రోజుల తర్వాత సంపాదించడం చేతకానీ చవటను చేసుకున్నందుకు ఇది కూడా ఫీల్ అయ్యి నిన్ను వదిలేసి వెళ్లిపోతుంది. జరిగేది ఇదే గుర్తుపెట్టుకోమని అనామిక అంటుంది. అనామిక మాటలకు సామంత్ నవ్వుకుంటాడు. సాటిమనిషిగా సానుభూతి చూపించడం తప్ప నేనేం చేయలేను.. అనామికను నమ్మితే మాత్రం తన పగ కోసం నిన్ను పావుగా వాడుకోవడానికే నీ దగ్గర చేరింది. పని అయ్యాక నిన్ను అసలు కేర్ కూడా చేయదని అప్పు అంటుంది. ఎందుకంత కోపం నేనేం తప్పుగా అనలేదు కదా.. ఇంతకముందే చెప్పాను కదా.. నీకు కవితలు రాయడం తప్పితే సంపాదించడం ఎలాగో చేతకాదు.. దీనికి పిజ్జాలు డెలివరీతోనే సంపాదనాయే.. ఇప్పుడు నిన్ను కూడా ఇదే పోషించాలి కదా అని అనామిక అంటుంది. అలా అనుకోవడం నీ అవివేకం.. నా కళ్యాణ్ కష్టపడి ఉద్యోగం చేస్తున్నాడని అప్పు అంటుంది. ఏంటి కళ్యాణ్ ఇది నిజమా అని అనామిక అంటుంది. మరోవైపు కావ్య ఒకతడితో డిజైన్స్ చేయడానకి డీల్ కుదుర్చుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.